News
అభివృద్ధి చేయాలని ప్రత్యేక శ్రద్ధ
ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ప్రాజెక్టులు ఒక రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయ్యడు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని వెటర్నరీ కాలనీలోని వెన్యూ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో కలిసి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాలా ఆదుకోవాలని, అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ ఉండటం వల్లే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇవ్వని ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ఇస్తున్నారని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








